జస్ట్ ఈ మధ్య కాలంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని అరుదైన రికార్డులను అందుకొని జస్ట్ వాటిని కామన్ చేసేసుకున్నాడు. తన లేటెస్ట్ సినిమా “అల వైకుంఠపురములో”తోనే ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన బన్నీ మరిన్ని సంచలన రికార్డులు అరుదైన ఫీట్ లను ఈ మధ్యలోనే సెట్ చేసాడు.
ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ లోని టాప్ మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సెలెబ్రెటీల జాబితాలో మొత్తం ఇండియన్స్ లో ఏకైక తెలుగు హీరోగా నిలిచి అరుదైన ఘనతను సాధించగా ఇప్పుడు మరో అదిరిపోయే ఫీట్ ను చేసాడని తెలుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సెర్చ్ ఇంజిన్ అయినటువంటి గూగుల్ లో కూడా బన్నీ ఈ 2020లో అత్యధికంగా సెర్చ్ చెయ్యబడిన తెలుగు హీరోల జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు.
అంతే కాకుండా గత 2014 నుంచి ఇప్పటి వరకు బన్నీనే ఇందులో ఆరేళ్ళ పాటు కొనసాగడం ఒక్క బన్నీకే చెల్లింది. ఇప్పుడు బన్నీ సుకుమార్ తో తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే సాలిడ్ పాన్ ఇండియన్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.


