లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో “సలార్” అనే అదిరిపోయే పాన్ ఇండియన్ చిత్రాన్ని అనౌన్స్ చేసి మరోసారి ఇండియన్ మొత్తంలో సెన్సేషన్ రేపారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ఏ రేంజ్ లో కనిపిస్తాడో అన్నది కూడా మాస్ అండ్ మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ను రివీల్ చేసారు.
ఇక అక్కడ నుంచి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న టాక్ మొదలయ్యింది. అయితే ఇప్పుడు అసలు ఈ సలార్ బ్యాక్ డ్రాప్ ఏంటి అన్నది రివీల్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్ గా కనిపిస్తాడని తెలిసిందే. కానీ ఈ చిత్రం ఒక రివెంజ్ డ్రామాగా ఉంటుందట.
అలాగే ఈ రివెంజ్ మరియు ముంబై మాఫియా నేపథ్యంలో కలిపి ఉంటుంది అని తెలుస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ పక్కా మాస్ మసాలా ఎలిమెంట్స్ తో సాలిడ్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రిపేర్ చేసారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం వచ్చే జనవరి నుంచి మొదలు కానుండగా సాధ్యమైనంత త్వరగా పూర్తి అవ్వనుంది.


