మెగా ఫ్యామిలీలన్నీ చాటెడ్ ఫ్లయిట్స్ బుక్ చేసుకున్నాయి

మెగా ఫ్యామిలీలన్నీ చాటెడ్ ఫ్లయిట్స్ బుక్ చేసుకున్నాయి

Published on Dec 7, 2020 8:45 PM IST

mega

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి వేడుకలు‌ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లో జరగనున్న నిహారిక వివాహ వేడుకకు మెగా కుటుంబాలన్నీ బయలుదేరి వెళ్లాయి. వెళ్లడం అంటే అలా ఇలా కాదు ప్రత్యేక విమానాల్లో వెళ్లాయి. ఒక్కో ఫ్యామిలీ ఒక్కోక ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకుని వెళ్లాయి. నాగబాబు, అయన సతీమణి, వరుణ్ తేజ్, వధువు నిహారిక, వరుడు చైతన్య జొన్నలగడ్డ, వరుడి తల్లి దండ్రులు ఒక విమానంలో రాజస్థాన్ వెళ్లారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ తేజ్, ఉపాసన ఇంకొక ప్రత్యేక విమానంలో వెళ్లారు. అల్లు అర్జున్, ఆయన సతీమణి అల్లు స్నేహ రెడ్డి, వారి పిల్లలు, అల్లు అరవింద్, ఆయన సతీమణి అల్లు గీత మరొక చాటెడ్ ఫ్లయిట్స్ బుక్ చేసుకుని రాజస్థాన్ చేరుకున్నారు. ఇలా మెగా కుటుంబాలు ఎవరికి వారు ప్రత్యేకంగా ఫ్లయిట్స్ ఏర్పాటుచేసుకుని వివాహ వేదికకు చేరుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో డిసెంబర్‌ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వివాహం జరగనుంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఈరోజు, రేపు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు