ఇప్పుడు మన తెలుగు ఆడియెన్స్ లో మొత్తం వైబ్ అవుతున్న సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ అనే చెప్పాలి. ఇది రాక ముందు హైప్ ఎంత ఉందో ఒక్కసారి సాంగ్ వచ్చాక మాత్రం మొత్తం మారిపోయింది అని చెప్పాలి.
ఊహించని రెస్పాన్స్ యు’నాని’మాస్ గా ఈ సాంగ్ కి వచ్చేసింది. సంగీత దర్శకుడు అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రికార్డులు ఇప్పుడు మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మోస్ట్ హైప్డ్ సినిమాల సాంగ్స్ కి వచ్చిన రేంజ్ లో వచ్చేసింది. 24 గంటల్లో ఆయా షేర్ సాంగ్ కి ఏకంగా 21.8 మిలియన్ వ్యూస్ రాగా 7 లక్షల లైక్స్ వచ్చాయి.
ఇది మన టాలీవుడ్ స్టార్స్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ లోనే బిగ్గెస్ట్ రెస్పాన్స్ లలో ఒకటి. దీనితో జడల్ జమానా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలానే నాని టైర్ 1 ఎంట్రీ కూడా ఈ రకంగా కూడా ఖరారు అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు.


