ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఫిబ్రవరి 25, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ప్రియాంక చోప్రా జోనస్, కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రూజ్ కోర్డోవా, సాఫియా ఓక్లీ-గ్రీన్, టెమురా మోరిసన్
దర్శకత్వం : ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్
నిర్మాతలు : ప్రియాంక చోప్రా, జో రస్సో, ఆంథోనీ రస్సో, ఏంజెలా రస్సో-ఓట్‌స్టాట్, మైఖేల్ డిస్కో
సంగీతం : హెన్రీ జాక్మన్
సినిమాటోగ్రఫీ : గ్రెగ్ బాల్డి
ఎడిటింగ్ : లిసా లాసెక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
హాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఉన్న పలు ఓటిటి రిలీజ్ లలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా జోనస్ ప్రధాన పాత్రలో ది బాయ్స్ నటుడు కార్ల్ అర్బన్ నెగిటివ్ రోల్ లో నటించిన “ది బ్లఫ్” (The Bluff) కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
The Bluff కథ:
1846 సమయంలో ఒక సముద్రపు దొంగల ముఠా నాయకుడు కెప్టెన్ కానర్ (కార్ల్ అర్బన్) తనకి ఎంతో విలువైన బంగారాన్ని పోగొట్టుకొని దానిని వెతికే పనిలో ఉంటాడు. అయితే ఆ బంగారం కేమన్ బ్రాక్ ప్రాంతానికి చేసిన ఒక మత్సకార యువతి అయినటువంటి ఎర్సెల్ (ప్రియాంక చోప్రా జోనస్) దగ్గరకు వెళుతుంది. సముద్రంలోకి వెళ్లిన తన భర్త కోసం ఆమె ఎదురు చూస్తూ తన కొడుకు, మరదలితో ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కానర్ మనుషులు ఆ ప్రాంతంపై దాడి చేస్తారు. మరి ఈ దాడిలో ఎర్సల్ ఏం చేసింది? ఆమెని వెతుక్కుంటూ కానర్ ఎందుకు వచ్చాడు? ఆ బంగారం ఎవరి దగ్గర ఉంది? ఆమె తన కుటుంబంని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో ప్రియాంక చోప్రానే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఆమె ఇంటెన్స్ నటనతో పాటుగా తన యాక్షన్ పెర్ఫామెన్స్ కూడా ఇందులో ఆశ్చర్యపరుస్తుంది. తన మేకోవర్ కొన్ని సీన్స్ లో ఊహించని విధంగా ఉంటాయి. ఆమె కుటుంబం కోసం ఆమె పడే తాపత్రయం అందులో చేసే యాక్షన్ పార్ట్ ఈ సినిమాలో మెప్పిస్తాయి.
తనతో పాటుగా ది బాయ్స్ నటుడు కార్ల్ అర్బన్ కూడా నీట్ రోల్ లో కనిపిస్తాడు. ఒక క్రూరమైన విలన్ గా ఇందులో విలనిజాన్ని తాను చూపించారు. అలాగే సఫియా ఓక్లే-గ్రీన్, వేదాంటెన్ నైడో తదితరులు ఈ సినిమాలో డీసెంట్ పెర్ఫామెన్స్ లు అందించారు.
ఇక ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కొరియోగ్రఫీ కూడా మంచి ఇంటెన్స్ గా ఉంది. ఎప్పుడైతే ప్రియాంక చోప్రా తన ఇంట్లో యాక్షన్ మొదలు పెడుతుందో అక్కడ నుంచి కనిపించే ప్రతీ యాక్షన్ బ్లాక్ చాలా సహజంగా సాగాయి. అలాగే సినిమా ఆరంభంలో కొన్ని నిమిషాల ఇంట్రో కథనంలోకి ఆడియెన్ ని తీసుకెళ్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ డైరెక్ట్ గా వస్తున్న ఓటిటి చిత్రాల్లో కనిపిస్తున్న ప్రధాన సమస్య ముఖ్యంగా హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు అంటే మినిమమ్ కొన్ని అంచనాలు స్టాండర్డ్స్ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో నేరుగా వస్తున్న ఆ సినిమాల్లో కథ పరంగా బలం లోపిస్తుంది.
ప్రియాంక నుంచి గతంలో ఇదే ప్రైమ్ వీడియోలో వచ్చిన హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అనే సినిమాలో కూడా పెద్ద బలమైన కథ ఉండదు కానీ మంచి యాక్షన్ తో సాగుతుంది. అలానే ఇందులో కూడా వింటేజ్ సెటప్ ఉంటుంది కానీ కథనం మాత్రం రొటీన్ గానే సాగుతుంది.
ఇది వరకు ఎన్నో సినిమాల్లో చూసేసిన రొటీన్ రివెంజ్ టెంప్లేట్ లోనే ఈ సినిమా కూడా సాగడంతో ఒక కొత్తదనంతో కూడిన హాలీవుడ్ సినిమా లాంటిది ట్రై చేద్దాం అనుకునేవారు డిజప్పాయింట్ అవుతారు. ఊహాజనితంగానే సాగే కథనం, సీన్స్ అంత ఎగ్జైట్ ఏమి చేయకుండానే వెళ్తాయి.
అలాగే కార్ల్ అర్బన్ రోల్ కూడా కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. పైగా ప్రియాంకా చోప్రా రోల్ తో విరోధం ఎందుకు అనే ఎమోషన్ లో డెప్త్ మిస్ కావడంతో అంశాలు అన్నీ సింపుల్ గా అలా నెమ్మదిగా వెళుతున్నట్టు అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా కనిపిస్తాయి. ఈ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా కనిపించే ప్రొడక్షన్ డిజైన్, కెమెరా వర్క్, మ్యూజిక్ వంటివి ఇంప్రెస్ చేస్తాయి. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ ఇందులో బాగా హైలైట్ అనుకోవచ్చు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
ఇక దర్శకుడు ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ విషయానికి వస్తే.. మొదలు పెట్టిన కొన్ని నిమిషాలు ఒక పైరేట్స్ ఆఫ్ కరేబియన్ తరహా ట్రీట్ ఇస్తారేమో అనిపిస్తుంది కానీ తాను యాక్షన్ పార్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి బలమైన కథనాన్ని మిస్ చేశారు. వీటిపై కూడా బాగా కేర్ తీసుకుంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ది బ్లఫ్’ (The Bluff) చిత్రంలో సాలిడ్ యాక్షన్, ప్రియాంక చోప్రా ఇంటెన్స్ పెర్ఫామెన్స్ లు బాగా మెప్పిస్తాయి. కాకపోతే కథ, కథనాలు పరంగా మరీ అంత ఎగ్జైట్ చేసే అంశాలు ఇందులో లేవు. సో ఇది ఒక రొటీన్ రివెంజ్ డ్రామా లానే అనిపిస్తుంది. సో కేవలం యాక్షన్ సినిమాల వరకే చూస్తాం కొత్త సినిమా చూడాలి అనుకుంటే తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ సినిమాని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


