ఈ మూడేళ్ళుగా మహేష్ హవానే అట.!

ఈ మూడేళ్ళుగా మహేష్ హవానే అట.!

Published on Dec 8, 2020 4:02 PM IST

mahesh sarileru

ప్రతీ ఏటా ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ లో మోస్ట్ పాపులర్ హ్యాష్ టాగ్స్ జాబితాను ఆయా రంగాల వారీగా విడుదల చేస్తారన్న సంగతి తెలిసిందే. అలా మన ఇండియన్ సినిమాల జాబితాకు వాచినట్టు అయితే గత మూడేళ్ళ నుంచి కూడా మన టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ సినిమాలే వరుసగా మన తెలుగు నుంచి నిలవడం విశేషం.

గత “భరత్ అనే నేను” నుంచి “మహర్షి”అలాగే ఇప్పుడు “సరిలేరు నీకెవ్వరు” తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ను కొట్టిన మహేష్ ఇదే హ్యాట్రిక్ సినిమాలతో ట్విట్టర్ ఇండియాలో వరుసగా మోస్ట్ ట్వీటెడ్ ఇండియన్ సినిమాల లిస్ట్ లో నిలుస్తూ వచ్చాడట. దీనితో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఇంకా అలాగే ఇప్పుడు మహేష్ చేస్తున్న మరో సినిమా “సర్కారు వారి పాట”హ్యాష్ ట్యాగ్ ను 95 మిలియన్ కు రీచ్ చేశారు. ఇంకో 5 మిలియన్ కనుక వేస్తే 100 మిలియన్ ట్వీట్స్ తో ఇండియాలో అదొక నెవర్ బిఫోర్ రికార్డు అవ్వనుంది. ఈ ప్రతీ దానికి రికార్డులు ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం వాటిలో ఎక్కడా తగ్గడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు