బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె క్రేజ్ వేరే లెవల్. ఆమెకు ఇండియాలోనే కాదు ప్రపంచంలోని పలుచోట్ల అభిమానులున్నారు. ‘XXX’ అనే బాలీవుడ్ చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్ విన్ డీజిల్ సరసం నటించడంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తమైంది. ఆమె నటనకు, అందానికే కాదు నవ్వుకు కూడ అభిమానులున్నారు. తాజాగా ఆమె విగ్రహాన్ని ఏథెన్స్ విమానాశ్రయంలో ప్రదర్శనకు ఉంచడమే ఇందుకు నిదర్శనం.
గ్రీస్ రాజధాని అయినా ఏథెన్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కోవిడ్ కారణంగా కొన్ని నెలలు మూసి ఉంచగా ఇటీవలే అక్కడ కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. దీంతో విమానాశ్రయం యాజమాన్యం ప్రయాణీకులకు చిరునవ్వుతో స్వాగతం పలకాలని ఉద్దేశ్యంతో సెలబ్రిటీల్లో ఉత్తమమైన నవ్వు కలిగిన సెలబ్రిటీలను ఎంపిక చేసి నవ్వుతున్న వారి విగ్రహాలను విమానాశ్రయంలో ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాల్లో దీపిక విగ్రహం కూడ ఉంది. అందమైన దరహాసంతో ఉన్న ఆ పాలరాతి విగ్రహం ప్రయాణీకులను ఆకట్టుకుంటోంది. ఆ విగ్రహం కింద ఇండియన్ బాలీవుడ్ నటి అని పేర్కొని ఉండటం, విగ్రహం పోలికలు దీపికను పోలి ఉండటంతో అది దీపిక విగ్రహమేనని అంటున్నారు ఆమె అభిమానులు. ఇకపోతే ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియం నందు కూడ దీపిక మైనపు ఉంది.


