పవన్ సినిమా పనులు చకా చకా జరిగిపోతున్నాయ్

పవన్ సినిమా పనులు చకా చకా జరిగిపోతున్నాయ్

Published on Dec 10, 2020 3:00 AM IST

Pawan Kalyan 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలకు సైన్ చేశారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉండగా ఇంకో నెలలో మొత్తం షూటింగ్ ముగియనుంది. ఇది పూర్తయ్యాక వెంటనే ‘అయ్యప్పన్ కోషియుమ్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటనలు పెద్దగా లేకపోయినా ప్రీప్రొడక్షన్ మాత్రం జోరుగానే సాగుతోందట. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులతో ఫైనల్ స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ కాగా బాణీలు కూడ రెడీ అయ్యాయట.

సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది. నిజానికి ఒరిజినల్ వెర్షన్లో ఒక థీమ్ సాంగ్ మినహా వేరే పాటలేవీ ఉండవు. అయితే తెలుగు కాబట్టి, అందునా పవన్ కళ్యాణ్ కాబట్టి మూడు పాటలైనా ఉండే అవకాశం ఉంది. సినిమాలో పవన్, హీరోయిన్ ట్రాక్ కూడ ఉంటుందట. కాబట్టి థీమ్ సాంగ్ తో పాటు పవన్ ఇంట్రో సాంగ్, ఇంకొక డ్యూయెట్ లాంటిది ఉండవచ్చు. ఇక పోరాట సన్నివేశాల్లో బిట్ సాంగ్స్ ఎలాగూ ఉండనే ఉంటాయి. సినిమాను వీలైనంత త్వరగా ముగించాలని పవన్ భావిస్తున్నారు. అందుకే థమన్ కొద్దిరోజుల క్రితమే వర్క్ స్టార్ట్ చేసేశారట. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు