న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ అంచనాల చిత్రం ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాఘవ్ జుయల్, మంచు మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో నాని తల్లి పాత్రలో ప్రముఖ నటి సొనాలి కులకర్ణి నటించారు. ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ ఈ పాత్ర గురించి ప్రశ్నించగా, నాని స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“ఈ సినిమాకి ‘ది ప్యారడైజ్’ కాకుండా వేరొక టైటిల్ పెట్టాల్సి వస్తే ‘సమ్మక్క’ అని పెట్టేవారమని.. ఇది పూర్తిగా ఆమె చిత్రమే” అని నాని పేర్కొన్నాడు. నాని ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో సినిమాలో తల్లి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఒకవేళ నిజంగానే ‘సమ్మక్క’ అనే టైటిల్ పెట్టి ఉంటే ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డాడు.


