కోట్ల రూపాయల సోనూ సూద్ సహాయం వెనుక విస్తుపోయే నిజాలు

కోట్ల రూపాయల సోనూ సూద్ సహాయం వెనుక విస్తుపోయే నిజాలు

Published on Dec 10, 2020 12:08 AM IST

sonu soodh

లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలకు, కూలీలకు విశేషంగా సహాయం చేసిన సెలబ్రిటీ ఎవరంటే టక్కున చెప్పే పేరు సోనూ సూద్. తెర మీద విలన్ వేషాలే వేసినా నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు ఆయన. ప్రత్యేక బస్సులు, విమానాలు, వందల మందికి భోజన వసతులు, కష్టాల్లో ఉన్న రైతులకు సహాయం చేయడం, పేద విద్యార్థులను ఆదుకోవడం, అనారోగ్యంతో బాధలు పడుతున్న బీదవారికి వైద్యం అందించడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం ఇలా అనేక రకాలుగా సహాయం చేశారు సోనూ.

ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆయన షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని మరీ జనం సహాయం కోసం ఆయన వద్దకు వస్తున్నారు. అడిగినవారికి కాదనకుండా చేతనైన సహకారం అందిస్తున్నారు సోనూ. ఇప్పటివరకు ఈ సేవా కార్యక్రమాలకు సోనూ ఖర్చు చేసిన మొత్తం దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. మరి ఇంత పెద్ద మొత్తాన్ని కొన్ని నెలల సమయంలోనే అది కూడ షూటింగ్లు లేని టైంలో సోనూ ఎలా తీసుకురాగలిగారు అనేది అందరి మదిలోనూ మెదిలిన ప్రశ్న. అయితే ఈ డబ్బు మొత్తాన్ని ఆయన తన ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకొచ్చారట. ముంబైలోని జూహులో తనకున్న 8 ఆస్తులను ఆయన తాకట్టులో ఉంచి అగ్రిమెంట్ చేసుకుని డబ్బు తెచ్చారట. సోనూ ఇలా అప్పుచేసి మరీ సహాయం చేశాడని తెలిసిన తర్వాత నెటిజన్లకు ఆయన మీదున్న గౌరవం మరింతగా పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు