మరో అరుదైన ఘనతతో ఇండియన్ ప్రైడ్ హీరోగా ప్రభాస్.!

మరో అరుదైన ఘనతతో ఇండియన్ ప్రైడ్ హీరోగా ప్రభాస్.!

Published on Dec 10, 2020 8:00 AM IST

prabhas

ఇప్పుడు ఖండాంతరాల్లో తెలుగు సినిమా పేరును చర్చించుకునేలా చేస్తున్న ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలితో అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రభాస్. అక్కడ నుంచి తెలుగు సినిమాకు ఎన్నో ఖ్యాతులు గడించిన ప్రభాస్ ఇప్పటికీ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతూ మరిన్ని మైలు రాయిలు అందుకుంటున్నాడు.

ఇప్పుడు అలానే మరో అరుదైన ఘనత ప్రభాస్ ముంగిట దాసోహం అయ్యింది.ప్రపంచంలో పాపులర్ అయిన యూకే ఈస్టర్న్ మ్యాగజైన్ వారు చేపట్టిన టాప్ 50 ఆసియన్ సెలెబ్రెటీ లిస్ట్ వరల్డ్ 2020లో టాప్ పది స్థానాల్లో ఒకడిగా ప్రభాస్ నిలిచాడు. ఈ టాప్ 10 లో 7వ స్థానంలో నిలిచిన ఏకైక దక్షిణాది హీరోగా అందులోను తెలుగు హీరోగా మరింత ఘనతను సంపాదించుకున్నాడు.

దీనితో ప్రభాస్ ను భారతదేశం గర్వించదగ్గ హీరోగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. ఇక ఈ లిస్ట్ లోనే లాక్ డౌన్ సమయంలో ఎంతోమందికి అండగా నిలిచిన సోనూ సూద్ నెంబర్ 1 స్థానంలో నిలవగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ 6వ స్థానంలో నిలిచింది. మొత్తానికి ప్రభాస్ అందుకున్న ఈ ఫీట్ తో మాత్రం రెబల్ ఫ్యాన్స్ చాలా గర్వపడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు