తారక్ ను మెప్పించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.?

తారక్ ను మెప్పించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.?

Published on Dec 10, 2020 10:00 AM IST

NTR

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తారక్ లైనప్ పై మరింత ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ కేవలం స్టార్ దర్శకులతోనే కాకుండా లేటెస్ట్ గా టాలీవుడ్ లో సత్తా చ్ఛాటుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులతో కూడా పని చెయ్యాలని అనుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

అలా తారక్ వీరాభిమాని అయినటువంటి విశ్వక్ సేన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ “హిట్” చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలనుతో తారక్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. రీసెంట్ గానే తారక్ కు స్క్రిప్ట్ ను వినిపించగా తారక్ కు అది నచ్చింది అని కూడా టాక్. మరి ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలి అంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతం తారక్ రాజమౌళితో చేస్తున్న RRR తో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు