బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ అంటున్న టాలీవుడ్ ప్రముఖ హీరో.!

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ అంటున్న టాలీవుడ్ ప్రముఖ హీరో.!

Published on Dec 10, 2020 7:30 PM IST

srikanth

మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ స్టేజ్ కు వస్తుంది. ఇంకో కొన్ని రోజుల్లో బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరు అన్నది తెలిసిపోనుంది. అయితే ఇప్పటి వరకు మిగిలి ఉన్న కొద్ది మంది కంటెస్టెంట్స్ కు కూడా మంచి ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఉంది. అలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్న కంటెస్టెంట్స్ లో అభిజీత్ కూడా ఒకడు.

ముఖ్యంగా సోషల్ మీడియాలోనే కాకుండా బిగ్ బాస్ షోను ఫాలో అయ్యే పలువురు సినీ మరియు స్మాల్ స్క్రీన్ ప్రముఖుల్లో కూడా అభిజీత్ కే సపోర్ట్ చేస్తుండడం గమనార్హం. అలా ఇప్పుడు మన టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో శ్రీకాంత్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్ అవుతాడని అంచనా వేస్తున్నారు. తాను ఈ సీజన్ ను మొదటి నుంచి ఫాలో అవుతున్నారని అలాగే తన అంచనా ప్రకారం అయితే అభిజీత్ విన్నవ్వాలి అనుకుంటున్నట్టుగా ప్రెడిక్ట్ చేసారు. మరి శ్రీకాంత్ అభి విషయంలో వేసిన అంచనా ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు