కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. మొదటి నుండి ఈ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట బడ్జెట్ సమస్యలతో ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినంత పనైంది. శంకర్ సినిమా అంటేనే డబ్బులు మంచి నీళ్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమాకి మాత్రం తగ్గించాలని నిర్మాతలు పట్టుబట్టారు. మొదట్లో శంకర్ దీనికి ఒప్పుకోలేదు. చివరికి కాంప్రమైజ్ అయి ఎలాగో షూట్ స్టార్ట్ చేశారు.
అంతా బాగానే ఉంది అనుకుంటుండగా సెట్లో భారీ క్రేన్ ప్రమాదం జరగడంతో చిత్రీకరణ కొన్నిరోజులు వాయిదాపడింది. ఆ తరవాత కరోనా లాక్ డౌన్ వచ్చి 8 నెలలుగా షూటింగ్ లేదు. పైగా ఇటీవల కమల్ ‘విక్రమ్’ సినిమాను మొదపెట్టారు. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ ఆగిపోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం మేరకు జనవరి నుండి షూట్ రీస్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కమల్ ‘ఇండియన్-2, విక్రమ్’ రెండు సినిమాలను ఒకేసారి చేస్తారని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినబడుతోంది.


