ఆమిర్ ఖాన్ సినిమా నుండి సేతుపతి ఔట్… కారణం పెద్దదే !

ఆమిర్ ఖాన్ సినిమా నుండి సేతుపతి ఔట్… కారణం పెద్దదే !

Published on Dec 12, 2020 12:00 AM IST

Aamir Khan

బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు టామ్ హంక్స్ నటించిన పాత్రలో అమీర్ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం దక్షిణాది నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు సేతుపతితో ఆమిర్ ఖాన్ బృందం చర్చలు కూడా జరిపారు. సినిమాలోని పాత్ర కోసం ఎలాంటి మేకోవర్ కావాలి, ఎలా మారాలి అనే విషయమై విజయ్ సేతుపతికి అన్ని వివరాలు ఇచ్చారట టీమ్.

సేతుపతి సైతం ఆమిర్ సినిమాలో నటించడానికి చాలా ఉత్సుకత చూపించారు. అయితే కొన్ని కారణాల వలన, చేస్తున్న సినిమాలు సెట్స్ మీద ఉండటంతో సేతుపతి ఆమిర్ ఖాన్ సినిమాలోని పాత్రకు తగ్గట్టు మారలేకపోయారట. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూట్ వాయిదాపడటంతో డేట్స్ కేటాయించడం కూడ కష్టమైందట. దాంతో ఆయన సినిమా నుండి పూర్తిగా తప్పుకున్నారట. దీంతో సేతుపతి సైతం కొంచెం నిరుత్సాహనికి గురయ్యారట. ఈ ఛాన్స్ మిస్సైనా భవిష్యత్తులో మాత్రం తప్పకుండా ఆమిర్ ఖాన్ తో కలిసి పనిచేయాలని భావిస్తున్నారట సేతుపతి. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 2021 ఆఖరులో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు