“ఏజెంట్” డైరెక్టర్ “మిషన్ ఇంపాజిబుల్” స్టార్ట్..ఆసక్తికర పోస్టర్ తో!

“ఏజెంట్” డైరెక్టర్ “మిషన్ ఇంపాజిబుల్” స్టార్ట్..ఆసక్తికర పోస్టర్ తో!

Published on Dec 12, 2020 12:06 PM IST

ఇటీవల కాలంలో మన తెలుగు సినీ పరిశ్రమకు నూతన దర్శకులు తన టాలెంట్ తో సత్తా చాటారు. అలా తన మొదటి సినిమాతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు స్వరూప్. తన సినిమా “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”తో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు తన రెండో సినిమా అది కూడా మన టాలీవుడ్ లో కొత్త టాలెంట్ కు పెద్ద పీఠ వేస్తున్న నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో రెడీ అయ్యాడు.

దీనికి “మిషన్ ఇంపాజిబుల్” అనే ఆసక్తికర టైటిల్ తో పాటుగా మరింత ఆసక్తికర పోస్టర్ ను కూడా లాంచ్ చేసారు. శ్రీకృష్ణుడు, శివుడు, హనుమంతుని గెటప్పులలో ముగ్గురు చిన్న పిల్లలు గన్స్ పట్టుకొని ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే టైటిల్ లో కూడా చిన్న పిల్లలు తప్పు రాసినట్టుగా మిషన్ అనే పదాన్ని డిఫరెంట్ గా పోర్ట్రె చెయ్యడమే కాకుండా చాక్ ఫీస్ తో బోర్డ్ పై రాసినట్టు చూపించారు.

దీనితో మరి ఈ చిన్న పిల్లలతోనే ఏదో క్రైమ్ థ్రిల్లర్ ను ప్లాన్ చేశారా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్మెంట్ బయటకు వచ్చేసింది. అలాగే ఈ చిత్రం రెగ్యులర్ షూట్ వచ్చే డిసెంబర్ 14 నుంచే మొదలు కానుంది అని కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తుండగా దీపక్ యెరగర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు