దస‌రా కానుకగా నాలుగు భాషల్లో అజయ్ దేవగన్ “మైదాన్”.!

దస‌రా కానుకగా నాలుగు భాషల్లో అజయ్ దేవగన్ “మైదాన్”.!

Published on Dec 12, 2020 4:05 PM IST

మన తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలా వరకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ పరిచయమే అలాగే ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న “RRR”లో ఒక కీలక పాత్ర మరింత దగ్గరవ్వనున్నారు. అయితే దానితో పాటుగా ఇప్పుడు మరో సినిమాతో పాన్ ఇండియన్ ప్రేక్షకులను పలకరించనున్నారు. భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌కి స్వ‌ర్ణ‌యుగ‌మైన 1952-62 మ‌ధ్య కాలానికి సంబంధించిన క‌థ‌తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే చిత్ర బృందం విడుదల చేసిన మైదాన్ పోస్టర్స్ ఆడియ‌న్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15, 2021న `మైదాన్` చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

ఇక ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ – “ ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌పై చూడ‌ని ఒక స్పూర్తివంత‌మైన క‌థ‌తో ప్రతి భారతీయుడు గర్వపడేలా మైదాన్ చిత్రం ఉంటుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15, 2021న మైదాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం“ అన్నారు. అలాగేనేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు