ఇక ఈరోజుతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 హౌస్ లో ఎవరు టాప్ 5 లో ఉంటారో అన్నది తేలిపోతుంది. అయితే ఈరోజు సండే కావడంతో బిగ్ బాస్ హౌస్ లో దీనిని ఫన్ డే లా జరుపుకుంటారు. మరి అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్ ప్రోమోలో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రైజ్ మనీ 50 లక్షలు గెలిస్తే ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదానిపై నాగ్ వ్యూ తీసుకొన్నారు.
మరి దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో రియాక్షన్ ను ఇచ్చారు కానీ అఖిల్ మరియు సోహెల్ లా సమాధానాలు అయితే మంచి ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. సోహెల్ అయితే తన అకౌంట్ లో అయితే లక్ష దాటి ఎప్పుడూ లేదని అన్నాడు. అలాగే అఖిల్ అయితే ఒకవేళ తాను గెలిస్తే ఒక కేఫె ను తెరుస్తానని..
దానికి నాగ్ నే గెస్ట్ గా పిలుస్తానని ముందే ఇన్వైట్ చేసేసాడు. కానీ నాగ్ మాత్రం రాత్రి 9 తర్వాతే సోహెల్ తో కలిసి వస్తానని చెప్పి మరింత ఎంటర్టైన్మెంట్ జోడించారు. మొత్తానికి మాత్రం హౌస్ లో లాస్ట్ బిఫోర్ సండే బాగానే ప్లాన్ చేశారు. మరి ఈరోజు ఎలిమినేషన్ లో ఎవరున్నారో చూడాలి.
50 Lakhs prize money dakkinchukunte reactions ila untayi ???? #BiggBossTelugu4 today at 9 PM on @StarMaa pic.twitter.com/lzX8LEUK4f
— Starmaa (@StarMaa) December 13, 2020


