క్లారిటీ వచ్చిందిగా “బిగ్ బాస్” ఇంటి నుంచి ఈమె అవుట్.!

క్లారిటీ వచ్చిందిగా “బిగ్ బాస్” ఇంటి నుంచి ఈమె అవుట్.!

Published on Dec 13, 2020 6:05 PM IST

BiggBoss4 1

ఇంకొక్క వారంలో మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగిసిపోనున్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు ఫైనల్ డే ఫర్ టాప్ ఫైనలిస్ట్ లు ఎవరో అన్నది రివీల్ అయ్యే రోజు. అయితే ఇప్పటికే అఖిల్ తో సోహెల్ ఫైనల్స్ కు వెళ్ళిపోయాడు.

మరి మిగిలి ఉన్న వారిలో అభిజీత్ కూడా సేఫ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ ప్రోమో ద్వారా మేకర్స్ అరియనా మరియు మోనాల్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది క్లారిటీ ఇచ్చేసారు. ఈరోజు ఉదయం మేము చెప్పినట్టుగానే మోనాల్ ఈరోజు ఎలిమినేట్ కానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

నాగ్ దగ్గర ఉన్న ప్రింట్ మెషిన్ నుంచి ఫైనలిస్ట్ ఫోటో ప్రింట్ రావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలిసిపోనుంది. అందులోనుంచి వస్తున్న ఫోటో చిన్నగా చూసినా అది అరియానానే అన్నట్టు క్లారిటీగా కనిపిస్తుంది. సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఫైనల్ ఎలిమినేటర్ గా మోనాల్ గజ్జర్ అనే కన్ఫర్మ్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు