అల్లరి నరేష్ తాజాగా చేస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ నుండి మంచి ఆఫర్ వాచినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. మరి, డీల్ సెట్ అయితే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక అల్లరి నరేష్ కూడా ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.
అందుకే పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పూర్తిగా నగ్నంగా కనిపించడానికి కూడా అంగీకరించాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. కెరీర్ లో ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసి తనకంటూ ఓ మిడియమ్ రేంజ్ మార్కెట్ సృష్టించుకున్న అల్లరి నరేష్.. కెరీర్ మొదట్లోనే నేను, ప్రాణం సినిమా లాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా చేశాడు.
మరి ఇప్పుడు ఇలాంటి సినిమాతో నరేష్ ఎలా హిట్ కొట్టగలడో చూడాలి. అయితే చాలా కాలం నుంచి హిట్ కోసం ఫైట్ చేస్తూ, గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు నరేష్.


