క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఎవ్వరూ ఊహించని విధంగా పాన్ ఇండియా సినిమాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా పీరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన అప్పటి పరిస్థుతుల ఆధారంగా జరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఈ చిత్రం పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో సాగుతుందట.
కాగా ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఒక జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. ఆ జవాన్ పాత్రలోనే విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. సుకుమార్ ‘పుష్ప’ సినిమా పూర్తవ్వగానే ఈ చిత్రం మొదలుకానుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపు ఏడాది పాటు పూర్తి డేట్స్ ను కేటాయిస్తున్నారట. ఇప్పటి ప్లాన్ ప్రకారం 2022లో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండటం.. పైగా కేదార్ సెలగంశెట్టి బన్నీకి అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఈ సినిమా హైప్ కి బాగా ఉపయోగపడనుంది.


