నందమూరి బాలకృష్ణ సరసన ఇప్పటికే మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ ఒక కథానాయిక పాత్ర కోసం ఫైనల్ చేశారని, రెండవ కథానాయకిగా తెలుగు నటి పూర్ణను ఎంచుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ ఇద్దరే హీరోయిన్స్ అని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది. అందుకే ‘‘మోనార్క్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపిస్తోంది.
అయితే టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే బాలయ్య సినిమా కథకు ఈ ‘‘మోనార్క్” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే బాగా ఆసక్తిగా ఉన్నాడని.. ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయపాటి టీం ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అందుకే బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి మరో సూపర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.


