ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా దేశ ఆయనకు శుభాకాంక్షల వెల్లువలు ఎత్తిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మరోపక్క తలైవర్ తన అన్నాత్తే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు కూడా వచ్చారు. మరి అంతకు ముందే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన రాజకీయ రంగ ప్రవేశంపై ఒక క్లారిటీ ఇస్తూ తాను పార్టీ ప్రకటిస్తున్నానని టైం ఫిక్స్ చేశారు. దీనితో అక్కడ నుండి రజినీ పేరు దేశ వ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
అయితే లేటెస్ట్ గా రజిని తన పార్టీకు గాను ఒక పేరును ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. రజిని స్థాపించిన పార్టీకు గాను “మక్కల్ సేవై కట్చి” అనే పేరును రిజిస్టర్ చేయించినట్టుగా సమాచారం.అలాగే తన పార్టీకు గాను “ఆటో” గుర్తు వచ్చినట్టుగా కూడా టాక్ విరివిగా వినిపిస్తుంది. మరి దీనిపై ఖచ్చితమైన క్లారిటీ రావాలి అంటే ఈ నెల ఆఖరు వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం తలైవర్ పొలిటికల్ ఎంట్రీ మంచి హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది.


