ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. అయితే భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం లేటెస్ట్ గా మోస్ట్ ట్వీటెడ్ తెలుగు సినిమాగా సరికొత్త రికార్డును సెట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే చాలా మేర షూట్ ను పూర్తి చేసేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ షూట్ స్టార్ట్ చేసేసుకున్నట్టు తెలుస్తుంది. నిజానికి జనవరిలో ప్లాన్ చేసిన షూట్ ను ఇప్పుడు హైదరాబాద్ లో మేకర్స్ స్టార్ట్ చేసినట్టు టాక్. పవన్ మరియు హీరోయిన్ శృతి హాసన్ ల నడుమ ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట.
అలాగే ఇక ఈ షూట్ తో సినిమా కూడా కంప్లీట్ అవ్వనున్నట్టు వినికిడి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అంజలి మరియు నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


