అక్కడ కూడ బన్నీ పాటే నెంబర్ వన్

అక్కడ కూడ బన్నీ పాటే నెంబర్ వన్

Published on Dec 16, 2020 10:04 PM IST

Butta

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2020కి గాను తెలుగు ఇండస్ట్రీ సాధించిన పెద్ద విజయం ఇదే. బన్నీ కెరీర్లో కూడ ఆత్యహదిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడానికి అందులోని పాటలు కూడ ప్రధాన కారణం. సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే పాటలు విడుదలయ్యాయి. విడుదలైన ప్రతి పాట పెద్ద సక్సెస్ అయింది. థియేటర్లలో ప్రేక్షకులు పాటలను గొప్పగా ఏంజాయ్ చేశారు.

ఈ పాటలు కోసమే సినిమాను రెండు మూడుసార్లు వీక్షించిన ప్రేక్షకులు ఉన్నారు.
అర్మాన్ మాలిక్ పాడిన ‘బుట్టబొమ్మ’ పాత గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని, మాస్, క్లాస్ అనే బేధం లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. 2020లో ఇండియావైడ్ చార్ట్ బస్టర్స్ గా నిలిచిన టాప్-10 యూట్యూబ్ పాటల్లో ‘బుట్టబొమ్మ, 3వ స్థానంలో నిలవగా ‘రాములో రాముల’ సాంగ్ 8వ స్థానంలో నిలిచింది. ఇక అమెజాన్ మ్యూజిక్ లో అయితే 2020లో వచ్చిన ఉత్తమమైన తెలుగు పాటల్లో మొదటి స్థానంలో నిలిచింది. సినిమా విడుదలై దగ్గర దగ్గర ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు