ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “వకీల్ సాబ్” షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇక ఇది లైన్ లో ఉండగానే పవన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసారు. మరి అలాంటి వాటిలో “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రంపై ఆ మధ్య అంతా రకరకాల గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు కూడా అలానే మరిన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి గాను పవన్ కు సన్నిహితుడు మరియు టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుంన్నారని ఓ టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో టాక్ ఏమిటి అంటే ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ను కూడా అందిస్తారని గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఈ రెండు అంశాలపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ నిజమైతే మాత్రం త్రివిక్రమ్ ఈ చిత్రానికి ఒక కీ రోల్ చేస్తున్నట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.


