
ఓ సినిమా విడుదల అవుతుంది అంటే నేటి రోజుల్లో ఆఫ్ లైన్ లోను అలాగే ఇంటర్నెట్ లో కూడా టికెట్కు కొనుకుంటాం. ఇక అలాగే ఆన్లైన్ లో అంటే మొట్ట మొదటగా గుర్తుకు వచ్చే యాప్ బుక్ మై షో. చాలా మేర ఓ సినిమాకు ఎంత స్థాయి క్రేజ్ ఉందో దీనిని బట్టి కూడా సినీ వర్గాలు భేరీజు వేస్తాయి.
మరి అలా ఈ ఏడాది విడుదల కాబడ్డ మొత్తం ఇండియన్ సినిమాల్లో టాప్ 5 సినిమాల్లో మొత్తం మూడు మన తెలుగు సినిమాలే చోటు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. టాప్ 2 లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన “అల వైకుంఠపురములో” నిలవగా టాప్ 3 లో సూపర్ స్టార్ మహేష్ నటించిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం నిలిచింది.
ఇక అలాగే 5వ స్థానంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన “భీష్మ” నిలిచినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది వీటితోనే దాదాపు ఎండ్ కూడా అయ్యిపోయింది. అయినప్పటికీ పలు బాలీవుడ్ చిత్రాలను కూడా దాటి ఇండియా లోనే బుక్ మై షోలో అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలుగా హవా చూపించాయి.

