పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈపాటికే సినిమా విడుదలకావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మాధ్యలోనే ఆగిపోయి ఆలస్యమైంది. లాక్ డౌన్ అనంతరం చిత్రీకరణ తిరిగి మొదలైంది. సుమారు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ఈరోజు చిత్రీకరణ ముగిసింది.
దీంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీలైనంత త్వరలో టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికైతే ఏప్రిల్ నెలలో విడుదల ఉండొచ్చని టాక్ వినిపిస్తుండగా త్వరలోనే
విడుదల తేదీ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


