‘రాకా’.. 37 వెనుకున్న సీక్రెట్ ఇదేనా!?

‘రాకా’.. 37 వెనుకున్న సీక్రెట్ ఇదేనా!?

Published on Sep 18, 2026 11:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో చేస్తున్న భారీ సినిమా రాకా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పలు డిఫరెంట్ గెటప్ లలో కనిపించబోతున్నాడు. అయితే గత కొన్నాళ్ల నుంచి సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదని ఎదురు చూస్తున్న అభిమానులకి లేటెస్ట్ గా ఒక పజిల్ లాంటి సీక్రెట్ నెంబర్ ఇచ్చి దాన్ని క్రాక్ చేయమని కొంచెం పని పెట్టారు.

అయితే దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటా అని అంతా తలలు బాదుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఓ ఇంట్రెస్టింగ్ థియరీ బయటకి వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక తోడేలుగా కూడా కనిపిస్తాడని ఓ క్లారిటీ ఉంది. అయితే దీనికి దగ్గరగానే ఆ 37 సంఖ్య ఉన్నట్టు తెలుస్తోంది. ఓ మనిషి తోడేలుగా మారే ఉష్ణోగ్రత సరిగ్గా 37 డిగ్రీల సెల్సీయస్ అట.

సో ఇక్కడ కనెక్షన్ కుదిరింది. అలానే తోడేళ్ళు జాతి తాలూకా పరుగు వేగం కూడా సగటు గంటకి 37 మైళ్ళు ఉంటుందట. సో ఇలా రాకా మేకర్స్ ఇచ్చిన నెంబర్ వెనుక ఉన్న ఆంతర్యంకి ఇది కూడా ఓ కారణం కావచ్చని చెప్పొచ్చు. మరి అసలు కారణం ఏంటి అనేది మేకర్స్ రివీల్ చేస్తే కానీ ఓ క్లారిటీ రాదు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు