కన్నడలోకి రీమేక్ కానున్న విజయ్ దేవరకొండ సినిమా

కన్నడలోకి రీమేక్ కానున్న విజయ్ దేవరకొండ సినిమా

Published on Dec 30, 2020 12:12 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాణ రంగంలోకి కూడ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన మొదటగా నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ‘పెళ్లి చూపులు’తో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడం జరిగింది. 2019లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కన్నడలోకి రీమేక్ చేయబోతున్నారు.

తెలుగు వెర్షన్ ను షామిర్ సుల్తాన్ డైరెక్ట్ చేయగా కన్నడ రీమేక్ ను శివగణేష్ డైరెక్ట్ చేయనున్నారు. శివగణేష్ గతంలో ‘డీ 16, జిగర్తాండ’ సినిమాలను కన్నడలోకి రీమేక్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎస్.హెచ్ క్రియేషన్స్ పతాకంపై సునీల్, హరీష్, రీమేక్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటించబోయే ప్రధాన పాత్రధారులు ఎవరనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేసే పనులు కూడ జరుగుతున్నాయి. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు