నిన్ననే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లకు స్వల్ప సమయ వ్యవధిలోనే కరోనా పాజిటివ్ లు నిర్ధారణ కావడం మెగా అభిమానులకు చాలా బాధాకరం కలిగించిన అంశంగా నిలిచింది. దీనితో అభిమానులు సహా ఇండస్ట్రీ హీరోలు కూడా వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
చరణ్ కు ఎలాంటి లక్షణాలు లేవు అతను స్ట్రాంగ్ గానే ఉన్నాడని నేను టెస్ట్ చేయించుకున్నాను నెగిటివ్ వచ్చింది అని కానీ తనకు మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఉపాసన తెలిపారు. ప్రస్తుతానికి అయితే హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని వేడి నీరు, ఆవిరి పట్టడం విశ్రాంతి తగు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా ఆమె తెలిపారు. మరి ఉపాసన కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.
This too shall pass !
Hopeful for a better 2021No symptoms & Mr C is holding strong ????????
I tested NEGATIVE but there’s a huge chance of me becoming COVID positive.For now its #homequarantine
with Mr. CLoads of warm liquids, steam inhalation & rest pic.twitter.com/JMiUOcRokC
— Upasana Konidela (@upasanakonidela) December 29, 2020


