రవితేజ సినిమాలో రాశి ఖన్నా !

రవితేజ సినిమాలో రాశి ఖన్నా !

Published on Jan 3, 2021 2:10 AM IST

ravi teja raashi khanna

రవితేజ తన తరువాత సినిమాని రమేష్ వర్మ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయింది. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయడం పూర్తీ చేశారు. రవితేజ సినిమాకి ఆయన డైలాగ్స్ రాయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా కూడ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ కి కూడా సిద్ధం అవుతుంది.

అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, ఈ సాంగ్ కోసం రాశి ఖన్నాను అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓ తమిళ్ సినిమా ఆధారంగా రాబోతుందని సమాచారం. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ వర్మ రవితేజతో గతంలో ‘వీర’ సినిమా చేయడం జరిగింది. ఆయన ‘రాక్షసుడు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. అందుకే ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు