
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం అంటే వెనక రెండు మూడు భారీ కమర్షియల్ హిట్ సినిమాలు ఉండాల్సిందే. అలాంటి కమర్షియల్ దర్శకులకే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంటుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అయితే చెప్పనక్కర్లేదు. స్టార్ దర్శకులకు కూడ చెర్రీని పట్టుకోవడం అంత ఈజీ కాదు. నెలలు కాదు సంవత్సరాలు ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ రామ్ చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తరవాత ఒక యంగ్ దర్శకుడికి అవకాశం ఇచ్చారు.
అతనే గౌతమ్ తిన్ననూరి. ‘మళ్ళీ రావా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తినన్నూరి ఆ తర్వాత నానితో ‘జెర్సీ’ సినిమా చేసి ఇండస్ట్రీ ప్రశంసలు అందుకున్నారు. సినిమా బిజినెస్ పరంగా ఒక మాదిరిగా సక్సెస్ అయితే క్రిటికల్లీ అక్లైమ్డ్ అనే పేరును తెచ్చుకుంది. ప్రస్తుతం ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు గౌతమ్. ఇతని టాలెంట్ నచ్చి చరణ్ అవకాశం ఇచ్చారట. ప్రస్తుతం స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. మరోవైపు చరణ్ తర్వాతి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేయవచ్చనే వార్తలు కూడ ఉన్నాయి. మరి వీటిలో చరణ్ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారో చూడాలి.

