స్యూర్ షాట్ హ్యాట్రిక్ కొడతా అంటున్న మాస్ మహారాజ్.!

స్యూర్ షాట్ హ్యాట్రిక్ కొడతా అంటున్న మాస్ మహారాజ్.!

Published on Jan 6, 2021 7:03 AM IST

raviteja

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పవర్ ప్యాకెడ్ యాక్షన్ డ్రామా “క్రాక్” ట్రైలర్ తో సాలిడ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం సంక్రాంతి రేస్ లో మొట్టమొదటిగా విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా రవితేజ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఈ సినిమాతో ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన “డాన్ సీను”, “బలుపు” చిత్రాలు సాలిడ్ హిట్టయ్యాయి. మరి ఈసారి ఈ మూడో చిత్రంతో డెఫినెట్ గా హ్యాట్రిక్ హిట్ అందుకుంటానని మాస్ మహారాజ్ అంటున్నారు. మరి ఈ జనవరి 9న విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు