టీజర్స్ పై ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ గట్టిగానే ప్లాన్స్ వేస్తున్నారు.!

టీజర్స్ పై ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ గట్టిగానే ప్లాన్స్ వేస్తున్నారు.!

Published on Jan 6, 2021 7:29 PM IST

pawan prabhas
ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రాబోతున్న రెండు మోస్ట్ అవైటెడ్ టీజర్స్ కోసమే సోషల్ మీడియాలో రచ్చ అంతా. ఒకటేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” టీజర్ కాగా మరొకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధేశ్యామ్”.

ఇంకొన్ని రోజుల్లోనే ఈ రెండు చిత్రాల తాలూకా టీజర్స్ వస్తున్నాయి. దీనితో ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. ఎలా అయినా సరే తమ అభిమాన హీరోల టీజర్స్ కు భారీ రెస్పాన్స్ తో గట్టి రికార్డులే అందించాలని చూస్తున్నారు. పోటాపోటీగా అయితే ఇప్పుడు ప్లానింగులలో పడ్డ వీరు ఈ రెండు టీజర్స్ కు భారీ టార్గెట్ లనే పెట్టుకున్నారు. మరి వీరి రికార్డులు ఎక్కడ వరకు సెట్ చేస్తారో అన్నది కూడా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు