ఇప్పుడు అన్ని సినీ వర్గాల్లో కూడా తమ భారీ చిత్రాల నుంచి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది. అలా మన తెలుగు నుంచి వస్తున్న పలు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “రాధే శ్యామ్”. పీరియాడిక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కించిన ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు పాన్ ఇండియన్ వైడ్ కూడా “రాధే శ్యామ్” టీజర్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య వచ్చిన సింపుల్ మోషన్ పోస్టర్ టీజర్ తోనే యూట్యూబ్ రికార్డ్స్ షేక్ అయ్యాయి. కానీ టీజర్ అప్డేట్ మాత్రం ఇంకా రాలేదు. మేకర్స్ కూడా మౌనం గానే ఉంటున్నారు. మొన్నీమధ్య దర్శకుడు రాధా టీజర్ అప్డేట్ వస్తుంది అని చెప్పారు తప్పితే ఎప్పుడు వస్తుందో ఏ వివరం చెప్పలేదు.
దీనితో ఒకింత నిశ్శబ్ద వాతావరణమే నెలకొంది. మరి తూఫాన్ ముందు ఉండే నిశ్శబ్దం అనుకోవచ్చా? ప్రభాస్ సినిమా నుంచి ఇప్పుడు ఓ అప్డేట్ వచ్చింది అంటే అది మామూలు రేంజ్ లో ఉండట్లేదు. మరి ఇదే ఊపులో సైలెంట్ గా టీజర్ అనౌన్సమెంట్ వచ్చినా అది వచ్చాక రిజల్ట్ మాత్రం చాలా వైలెంట్ ఉంటుందని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.


