ప్రభాస్ “సలార్” ఫీమేల్ లీడ్ పై మరిన్ని గాసిప్స్.!

ప్రభాస్ “సలార్” ఫీమేల్ లీడ్ పై మరిన్ని గాసిప్స్.!

Published on Jan 9, 2021 10:00 AM IST

Salaar

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన చిత్రం “సలార్” ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇపుడు అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయి. మరి ఈ చిత్రానికి సంబంధించి ప్రశాంత్ నీల్ సాలిడ్ ప్లానింగ్ లు వేస్తున్న టాక్ ఆ మధ్యనే వచ్చింది.

ఒక్క క్యాస్టింగ్ పరంగా మాత్రమే కాకుండా టెక్నిషియన్స్ విషయంలో కూడా స్లైడ్ ప్లానింగ్ లను గీస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియన్ చిత్రంలో హీరోయిన్ గా ముందు దిశా పటాని పేరును అండర్ లైన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది. ఈ ఫీమేల్ లీడ్ కు గాను ఇప్పుడు మళ్ళీ పూజా హెగ్డే పేరు కూడా రేస్ లోకి వచ్చినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ పూజతో “రాధేశ్యామ్” సినిమా చేస్తున్నాడు. మరి ఇందులో కూడా ఉందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు