“కోబ్రా” టీజర్..విక్రమ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రయోగం.!

“కోబ్రా” టీజర్..విక్రమ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రయోగం.!

Published on Jan 9, 2021 11:05 AM IST

cobra teaser

కోలీవుడ్ లో ఉన్నటువంటి విలక్షణ హీరోలలో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. తన ప్రతీ సినిమాకు ఏదొక వైవిధ్యతను తన నటనలో సరికొత్త కోణాలు గెటప్పులు చూపిస్తూ కొత్త సబ్జెక్టులతో చియాన్ వస్తాడు. అందుకే విక్రమ్ సినిమాలు అంటే మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలా తన సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా విక్రమ్ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా చేసిన మరో ఆసక్తికర ప్రయోగమే “కోబ్రా”.

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞ్యానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాలుకా టీజర్ ను మేకర్స్ ఇప్పుడు విడుదల చేశారు. ఇక దీన్ని చూసినట్లయితే ఇందులో విక్రమ్ ఓ మాథమెటికల్ జీనియస్ గా కనిపిస్తున్నాడు. అలా ప్రతీ ప్రాబ్లమ్ కు నంబర్స్ తోనే పరిష్కారం ఉంటుందని నమ్మే రోల్ కనిపిస్తున్నాడు.

అలాగే ఈ రోల్ ఉన్న విక్రమ్ తన జీనియస్ పర్సనాలిటీతో ఎంత వరకు వెళ్ళాడు అతను ఏవో ప్రయోగాలు చేసినట్టుగా ఇందులో కనిపిస్తుంది. మరి అలాగే పవర్ ఫుల్ విలన్ రోల్ లో ఇర్ఫాన్ పఠాన్ అమేజింగ్ గా కనిపిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఛాలెంజ్ సీన్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా కొన్ని విజువల్స్ అయితే అవుట్ స్టాండింగ్ గా హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి.

ఇందులో హరీష్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్ అని చెప్పాలి. మరి అలాగే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా మంచి ఎస్సెట్ గా ఈ టీజర్ లో అనిపించింది. కానీ ఈ చిత్రంలో విక్రమ్ అనేక గెటప్పులు వేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో కూడా కొన్ని చూపించారు. కానీ వాటిలో ప్రోస్తెటిక్ మేకప్ ఇంకా రియాలిటీగా కనిపిస్తే బాగున్ను. ఇది పక్కన పెడితే టీజర్ మాత్రం మంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు