ఆగని “కేజీయఫ్ 2” టీజర్ మాన్స్టర్ బ్లాస్ట్ రికార్డ్స్.!

ఆగని “కేజీయఫ్ 2” టీజర్ మాన్స్టర్ బ్లాస్ట్ రికార్డ్స్.!

Published on Jan 9, 2021 1:02 PM IST

yash kgf2

ఇండియన్ బాక్సాఫీస్ అంతటిని మరోసారి మన దక్షిణాది నుంచి ఓ సినిమా షేక్ చెయ్యడానికి రెడీ అవుతుంది. అదే “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నుంచి వచ్చిన టీజర్ కనీ వినీ ఎరుగని రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతుంది.

ఒక్కరోజులోనే 78 మిలియన్ సెన్సేషనల్ వ్యూస్ అలాగే 4.2 మిలియన్ లైక్స్ తో ఆల్ టైం రికార్డులను సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డును టచ్ చేసింది. లేటెస్ట్ గా 90 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చెయ్యడమే కాకుండా 5 మిలియన్ లైక్స్ కొల్లగొట్టి భారీ ఆల్ టైం రికార్డులను అందుకుంది.

మరి ఈ మాన్స్టర్ టీజర్ రికార్డ్స్ లెక్కలు ఏ ఫిగర్స్ దెగ్గర ఆగుతాయో కూడా ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇక అలాగే ఈ టీజర్ నెక్స్ట్ స్టాప్ 100 మిలియన్ వ్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండగా మరికొంతమంది అగ్ర నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు