పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలా కాలం తర్వాత స్టార్ట్ చేసిన చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక అలాగే దీనితో పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు సెట్టయ్యాయి.
కానీ ఊహించని విధంగా కరోనా అడ్డు రావడంతో అన్ని సినిమాల్లానే ఇది కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ఇక అలా దీర్ఘ కాలం విరామం అనంతరం ఎట్టకేలకు సినిమా విడుదలకు రాబోతుంది. అయితే ఈ చిత్రం నుంచి రానున్న టీజర్ కోసమే అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ టీజర్ కు సంబంధించి మరో లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ టీజర్ నిడివి నిమిషం కన్నా తక్కువే ఉంటుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి నిమిషం కన్నా తక్కువే అంటే ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగించే అంశమే అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సిందే. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.


