యాక్షన్ స్టైల్ ను మార్చనున్న బాలయ్య !

యాక్షన్ స్టైల్ ను మార్చనున్న బాలయ్య !

Published on Jan 11, 2021 5:00 PM IST

Balakrishna

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే వారంలో జరగనున్న షెడ్యూల్ ను పిడుగురాళ్లలో షూట్ చేయనున్నారు. కాగా, ఈ సన్నివేశాల్లో బాలయ్య కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. అంటే.. బాలయ్య తన స్టైల్ ను పూర్తిగా మార్చాలనుకుంటున్నాడట. ముఖ్యంగా తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్య మార్పు చూపించాలనుకుంటున్నాడట.

అందుకే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లతో ఇదే విషయాన్ని మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య అభిరుచికి తగ్గట్లు యాక్షన్ లో కొత్తదనం పెడుతున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు