విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు అభిమానులకు శుభవార్తను చెప్పారు. ఈరోజు సాయన్తరం అనుష్క పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్లింగా ఉంది. మాకు ఆడబిడ్డ పుట్టింది. మీ అందరి ప్రేమకు, ప్రార్థనలకు, అభిమానానికి నా కృతఙ్ఞతలు. అనుష్క, పాప క్షేమంగా ఉన్నారు. మా జీవితాల్లో ఈ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు విరాట్.
అంతేకాదు ఈ సమయంలో మా ప్రైవసీని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాం అన్నారు కూడ. ఆస్ట్రేలియా టెస్ట్ టూర్లో ఉన్న కోహ్లీ ప్రసవం సమయంలో అనుష్కకు తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో టూర్ నుండి సెలవు తీసుకుని ఇండియా వచ్చారు. విరుష్క దంపతులు తల్లిదండ్రులు అయ్యారన్న సంగతి తెలిసిన అభిమానులు, సన్నిహితులు, క్రికెట్, సినీ సెలబ్రిటీలు వారికి శుభాకంక్షాలు తెలుపుతున్నారు.


