పవన్ క్రేజీ చిత్రానికి ఈ హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యింది.!

పవన్ క్రేజీ చిత్రానికి ఈ హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యింది.!

Published on Jan 12, 2021 5:22 PM IST

Pawan 1

తన కం బ్యాక్ చిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” అనే సినిమాను లైన్ లో పెట్టారు. ఇక దీనితో పాటుగా ఈ చిత్రం లైన్ లో ఉండగానే ఇంతకూ ముందు ఎప్పుడు లేని విధంగా ఒకేసారి చాలానే వరుస సినిమాలు ఓకే చేసేసి షాకిచ్చారు. మరి అలా పవన్ టేకప్ చేసిన పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు లలో “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. మంచి అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది.

దగ్గుబాటి రానా కూడా నటిస్తున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రంలో పవన్ కు ఫిమేల్ లీడ్ లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపిస్తుంది అని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అది నిజమే అన్నట్టు తెలుస్తుంది. మేకర్స్ ఈ చిత్రంలో పవన్ కు ఫిమేల్ లీడ్ గా ఈమెనే ఫిక్స్ చేశారట. ఇక ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకతం వహించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ భారీ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు