తన వాట్సాప్ హ్యాక్ పై అలెర్ట్ చేస్తున్న మంచు మనోజ్.!

తన వాట్సాప్ హ్యాక్ పై అలెర్ట్ చేస్తున్న మంచు మనోజ్.!

Published on Jan 17, 2021 1:25 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ లవబుల్ హీరోల్లో మంచు వారి టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ కూడా ఒకడు. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కూడా అనేకమంది అభిమానులను మనోజ్ సంపాదించుకున్నాడు. మరి అలాగే అభిమానులు ఏం అడిగినా కాదని చెప్పని మంచు మనోజ్ ఇప్పుడు సడెన్ గా తన అభిమానులు కుటుంబ సభ్యులు మరియు తన స్నేహితులను అలర్ట్ చేస్తున్నాడు.

తన వాట్సాప్ హ్యాక్ అయ్యిందని ఎవరూ దానికి రెస్పాండ్ అవ్వొద్దని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే ఈ మధ్యనే వాట్సాప్ కు సంబంధించి ప్రైవసీ పాలసి విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలో ఇలాంటి ఘటన ఎదురవ్వడం మరింత షాక్ కు గురి చేస్తుంది. అయితే ఇంతకు ముందే చాలా మంది సెలెబ్రెటీల తాలూకా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి అలాగే ఫ్యాన్స్ ఇప్పుడు మనోజ్ సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు