మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ కూడా ఒకడు. కేవలం తన నటనతోఏ కాకుండా తన రచనతో కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు “మేజర్” మరియు “గూఢచారి 2” సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అయితే వీటిలో “మేజర్” సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. రియల్ హీరో మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ లెవెల్లో విడుదలకు రెడీ చేస్తున్న ఈ చిత్రం తాలూకా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసారు.
ఈ చిత్రాన్ని వచ్చే జూలై 2న విడుదల చెయ్యాలి ఫిక్స్ చేశారు. మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రంకు శశి కిరణ్ దర్శకత్వం వహించగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సోనీ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


