ఎ సుజీత్ మ్యాడ్ ఫ్రేమ్స్.. నాని, పవన్, ప్రభాస్ లతో మళ్ళీ హింట్?

ఎ సుజీత్ మ్యాడ్ ఫ్రేమ్స్.. నాని, పవన్, ప్రభాస్ లతో మళ్ళీ హింట్?

Published on Feb 27, 2026 7:09 PM IST

sujeeth

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో సుజీత్ కూడా ఒకరు. మరి సుజీత్ తన కొన్ని సినిమాలతోనే భారీ గ్రాసర్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే సినిమా చేసి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు నాచురల్ స్టార్ నానితో “బ్లడీ రోమియో” అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా ఓ మ్యాడ్ ఫ్రేమ్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

తన ముగ్గురు గ్యాంగ్స్టర్ త్రయం అంటూ బ్లడీ రోమియో నుంచి నాని, ఓజి నుంచి పవన్ కళ్యాణ్, సాహో సినిమా నుంచి ప్రభాస్ ల తాలూకా మ్యాడ్ ఫ్రేమ్ లని షేర్ చేసి అదరగొట్టాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సుజీత్ తన సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఆల్రెడీ ఓజి, సాహో క్రాసోవర్ ని సెట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఓజి సక్సెస్ టూర్ లో నానితో చేసే సినిమాని కూడా లింక్ చేద్దామా అని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు గ్యాంగ్ స్టర్ లని చూపిస్తూ తన సినిమాటిక్ యూనివర్స్ పై మళ్ళీ హింట్ ఇచ్చినట్టే అని చెప్పాలి. మరి మూడు సినిమాలకి కూడా లింక్ ఉంటుందా లేదా అనేది చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు