మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంక్రాంతి రేస్ ఎంత అచ్చొచ్చిందో తెలిసిందే. అందుకే ఈసారి తాను తీస్తున్న మరో మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”ను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రెడీ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా గత ఏడాది దర్శకుడు అనీల్ రావిపూడితో తీసిన చిత్రం “సరిలేరు నీకెవ్వరు” సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
అయితే బాక్సాఫీస్ దగ్గర ఎంత బలంగా అయితే ఈ చిత్రం నిలిచిందో స్మాల్ స్క్రీన్ పై కూడా అంతే స్థాయిలో అదరగొట్టింది. మొట్ట మొదట సారి టెలికాస్ట్ చెయ్యగా ఆల్ టైం రికార్డు టీఆర్పీ నే కొల్లగొట్టిన ఈ చిత్రం వరుసగా నాలుగో సారి కూడా అదిరిపోయే టీఆర్పీనే రాబట్టింది.
కొన్ని రోజుల కితం జెమినీ టీవిలో నాలుగో సారి టెలికాస్ట్ చెయ్యగా 10.18 టీఆర్పీ నెలకొల్పడం విశేషం. వరుసగా నాలుగు సార్లు కూడా 10కి పైగా టీఆర్పీ రాబట్టడం అనేది చిన్న విషయం అయితే కాదు కానీ అది మహేష్ చేసి చూపించాడు. మరి ఈసారి రాబోయే “సర్కారు వారి పాట” ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.


