
ప్రస్తుతం మన తెలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే చాలా కాలం గ్యాప్ మరియు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ మధ్యనే దుబాయ్ లో కీలక షెడ్యూల్ తో స్టార్ట్ చేశారు.
మరి ఈ షెడ్యూల్ లో మహేష్ మరియు కీర్తిల మధ్య ఒక రొమాంటిక్ ట్రాక్ ను తియ్యడమే కాకుండా సినిమాకు కీలకమైన మరిన్ని సీన్స్ కూడా తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం అక్కడే మహేష్ పై ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ ను కూడా మేకర్స్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
దీనిని స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు డిజైన్ చేస్తున్నారని బజ్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ తో మహేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

