‘మోసగ్గాళ్లు’ కోసం విష్ణు నిర్ణయం సరైనదే

‘మోసగ్గాళ్లు’ కోసం విష్ణు నిర్ణయం సరైనదే

Published on Feb 4, 2021 1:12 AM IST

mosagallu

మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం ‘మెసగాళ్ళు’. ప్రపంచంలోని అతిపెద్దదైన ఐటీ కుంభకోణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆత్యహదిక భాగం విదేశాల్లోనే షూటింగ్ జరిపారు. మొదట ఈసినిమాను మార్చి 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసియాన్ టీమ్ ఇప్పుడు డెసిషన్ మార్చుకున్నారు. మార్చి 19న విడుదలను ఖరారు చేశారు.

మార్చి 11న ‘గాలి సంపత్, జాతిరత్నాలు, శ్రీకారం’ లాంటి సినిమాలున్నాయి. ఈ మూడు సినిమాలతో పాటు ‘మోసగాళ్లు’ కూడ చేరితే నాలుగు సినిమాలు అవుతాయి. అందుకే పోటీ నుండి తప్పుకుని మార్చి 19కి డేట్ మార్చుకున్నారు టీమ్. బాక్సాఫీస్ క్లాష్ అవాయిడ్ చేయడానికి విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినదే. ఈ చిత్రానికి మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో భారీ వ్యయంతో నిర్మించగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. నవదీప్, నవీన్ చంద్ర, అలాగే రుషి శర్మ తదితరులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు