
ప్రపంచపు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పటి వరకు వచ్చిన నానాలుగు సీజన్లు కూడా ఒకదాన్ని మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. కానీ సీజన్ 4 అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అలాగే ఈ సీజన్ కూడా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ సీజన్ విన్నర్ అభిజీత్ కూడా ఒకడు.
తనదైన గేమ్ తో చివరి నిమిషం వరకు వచ్చిన అభిజీత్ భారీ ఫాలోయింగ్ కు సంపాదించుకున్నాడు. ఇంతకు ముందు విన్నర్స్ కు కూడా లేని హైప్ అభిజీత్ కు నమోదు అవ్వడమే కాకుండా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కానీ అభిజీత్ నుంచి సరైన గుడ్ న్యూస్ కోసం అభిజీత్ ఫాలోవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అదే అభిజీత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం.
హీరోగా అభిజీత్ ఎప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తాడా అని చూస్తున్నారు. కానీ అభిజీత్ నుంచి మాత్రం ఆ సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. దీనితో అభిజీత్ ఫ్యాన్స్ లో కాస్త నిరాశ ఏర్పడింది. అభిజీత్ కు ఇప్పటికీ కూడా మంచి క్రేజ్ ఉంది మరి అభిజీత్ ఆ కబురు ఎప్పుడు అందిస్తాడో చూడాలి.

